ఐకియాతో క‌లిసి 70 ఇళ్లకు మరమ్మత్తులు చేసిన హ్యాబిటట్‌ ఫర్‌ హ్యూమానిటీ

Habitat for Humanity Renovates 70 Homes with Ikea. అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన హోమ్‌ ఫర్నిషింగ్స్‌ కంపెనీ ఐకియాతో

By Medi Samrat
Published on : 15 July 2022 1:00 PM IST

ఐకియాతో క‌లిసి 70 ఇళ్లకు మరమ్మత్తులు చేసిన హ్యాబిటట్‌ ఫర్‌ హ్యూమానిటీ

అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన హోమ్‌ ఫర్నిషింగ్స్‌ కంపెనీ ఐకియాతో కలిసి హౌసింగ్‌ నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌ హ్యాబిటట్‌ ఫర్‌ హ్యుమానిటీ ఇండియా హైదరాబాద్‌లోని జగద్గరిగుట్ట వద్ద నివసిస్తోన్న 70 అల్పాదాయ కుటుంబాల ఇళ్లకు మరమ్మత్తులను చేసింది. వీరంతా కూడా రోజువారీ కూలీలు, ఇళ్లలో పనిచేసే వారు, కూరగాయల విక్రేతలతో పాటుగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారు. ఈ ఇళ్లలో చాలా వరకూ 20 సంవత్సరాలకు పైబడిన వయసు కలిగి ఉండటంతో పాటుగా తక్షణమే మరమ్మత్తులు చేయాల్సిన స్థితిలో ఉన్నాయి. ఈ మరమ్మత్తులలో భాగంగా పగుళ్లను పూడ్చడం, ప్లాస్టరింగ్‌ పెయింటింగ్‌, తలుపులు, పైకప్పు సరిచేయడం, టాయ్‌లెట్లను సమూలంగా మార్చడం వంటివి చేశారు.

ఈ ప్రాజెక్ట్‌ విజయవంతం కావడం గురించి హ్యాబిటట్‌ ఫర్‌ హ్యుమానిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజన్‌ శామ్యూల్‌ మాట్లాడుతూ ''ఐకియాతో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా భారతదేశంలో అందుబాటు ధరలలోని గృహాలకు మద్దతునందిస్తున్నాము. సురక్షితమైన, స్థిరమైన ఇళ్లలో పెరగడం వల్ల ఈ కుటుంబాలు తమకు తాము మంచి భవిష్యత్‌ నిర్మించుకోవడానికి అవసరమైన బలం, స్ధిరత్వం, స్వీయ విశ్వాసాన్ని సాధించడంలో సహాయపడతాయి'' అని అన్నారు.

''ఇల్లు చక్కగా ఉంటే ప్రతి రోజూ జీవితం కూడా చక్కగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. ఇల్లు ప్రతి ఒక్కరి ప్రాధమిక హక్కు. ఈ ప్రపంచంలో అతి ముఖ్యమైన ప్రాంగణాలలో ఇది ఒకటి. హ్యాబిటట్‌ ఫర్‌ హ్యుమానిటీ ఇండియాతో ఈ భాగస్వామ్యం పట్ల సంతోషంగా ఉన్నాము. హైదరాబాద్‌లో ఈ బస్తీ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా అమలు చేయడం ద్వారా ఐకియా యొక్క ఏ ప్లేస్‌ కాల్డ్‌ హోమ్‌ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేశాము'' అని క్రిస్టోఫీ జీన్‌ ఇలియాన్‌ అడ్రియాన్‌, మార్కెట్‌ మేనేజర్‌, ఐకియా ఇండియా–హైదరాబాద్‌ అన్నారు.















Next Story