హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. ఒకరు మృతి
హైదరాబాద్ నగరంలోని మలక్‌పేట్‌లో కాల్పులు కలకలం రేపాయి.
By అంజి
హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. ఒకరు మృతి
హైదరాబాద్: నగరంలోని మలక్‌పేట్‌లో కాల్పులు కలకలం రేపాయి. మంగళవారం నాడు ఉదయం శాలివాహననగర్‌లోని పార్కు వద్ద చందు నాయక్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండుగులు కాల్పులు జరిపారు. కారులో వచ్చిన దుండగులు ఒక రౌండ్ కాల్పులు జరిపి హత్య చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ చందునాయక్ అక్కడికక్కడే చనిపోయాడు. పార్క్‌లో కాల్పులు జరగడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
వెంటనే అక్కడి నుంచి ప్రజలు పరుగులు తీశారు. అటు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. పార్క్ సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతుడు సీపీఐ నాయకుడు చందునాయక్ చైతన్యపురిలో నివాసం ఉండేవాడు. భూ వివాదాలే ఈ ఘటనకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.