మందకొడిగా సాగుతోన్న గ్రేటర్ పోలింగ్..

Greater Election Polling Update. గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభ‌మైన‌ పోలింగ్‌ మందకొడిగా సాగుతోంది.

By Medi Samrat  Published on  1 Dec 2020 4:51 AM GMT
మందకొడిగా సాగుతోన్న గ్రేటర్ పోలింగ్..

గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభ‌మైన‌ పోలింగ్‌ మందకొడిగా సాగుతోంది. పోలింగ్‌ ప్రారంభమైన తొలి రెండు గంటల్లో కనీసం ఒక్క శాతం పోలింగ్‌ కూడా నమోదు కాలేదు. ఉదయం 9 గంటల వరకు 0.14 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ ప్రారంభమై 2 గంటలు గడుస్తున్నా జనాలు బయటికి రావడం లేదు. పాతబస్తీలో పోలింగ్‌ బూత్‌లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఐటీ కారిడార్‌లో ఓటేసేందుకు టెకీలు ముందుకు రావడం లేదు

ఇదిలావుంటే.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 150 డివిజన్లలో పోలింగ్‌ జరగనుంది. గ్రేటర్‌ పరిధిలో 74,44,260 మంది ఓటర్లు 1,122 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. 38,77,688 మంది పురుషులు, 35,65,896 మంది మహిళలు, 676 మంది ఇతరులు కలిపి మొత్తం 74,44,260 మంది ఓటర్లున్నారు. ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, ఇతర పోలింగ్‌ సిబ్బంది కలిపి మొత్తం 48 వేల మంది పోలింగ్‌ విధుల్లో పాల్గొంటున్నారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీవీ ప్యాట్‌లు అందుబాటులో లేకపోవడంతో ఈవీఎంలకు బదులు పేపర్‌ బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. 9,101 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 2,277 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ సదుపాయం కల్పించారు. ఇదిలావుంటే.. ఉద‌యం నుండే సినీ, రాజ‌కీయ‌, వివిధ రంగాల‌కు చెందిన ప్రముఖులు ఓటు *హ‌క్కును వినియోగించుకుంటూ.. ఓట‌ర్ల‌ను చైత‌న్య ప‌రుస్తున్నారు. అంద‌రూ విధిగా ఓటు వేయాల‌ని కోరుతున్నారు.

*చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ వి.ఎన్. రెడ్డి నగర్ ప్రగతి విద్యాలయ పాఠశాలలో నగర్ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

*రాజేంద్రనగర్‌లోని ఉప్పరిపల్లిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

*హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ కుందన్‌బాగ్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

*నాంపల్లిలోని వ్యాయమశాల హైస్కూల్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

*ముషీరాబాద్‌ నియోజకవర్గం గాంధీనగర్‌లో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కే లక్ష్మణ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

*శాస్త్రిపురం డివిజన్‌లో సేంట్ ఫైజ్ పాఠశాలకు బైక్‌పై వచ్చి ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

*కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కాచిగూడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.




Next Story