హైద‌రాబాద్ మెట్రోస్టేష‌న్‌లో యువతి డ్యాన్స్‌

Girl dancing in Hyderabad metro goes viral.భాగ్య‌న‌గ‌రానికి తలమానికంగా మారిన మెట్రో రైళ్లలో నిత్యం ల‌క్ష‌లాది మంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 July 2022 9:40 AM GMT
హైద‌రాబాద్ మెట్రోస్టేష‌న్‌లో యువతి డ్యాన్స్‌

భాగ్య‌న‌గ‌రానికి తలమానికంగా మారిన మెట్రో రైళ్లలో నిత్యం ల‌క్ష‌లాది మంది ప్ర‌యాణీకులు ప్ర‌యాణిస్తుంటారు. ట్రాఫిక్ చికాకులు, రణగొణ ధ్వనులు లేకుండా ప్రశాంతంగా ప్రయాణానికి హైదరాబాదీలు అలవాటు పడటంతో మెట్రో రైళ్లు అన్ని వేళల్లోనూ కిటకిటలాడుతున్నాయి. అయితే.. కొద్ది మంది వికృత, అతి చేష్ట‌ల వ‌ల్ల కొన్ని సార్లు మిగ‌తా ప్ర‌యాణీకులు ఇబ్బందులు ప‌డుతున్నారు.

తాజాగా మెట్రో స్టేషన్‌లో ఓ యువతి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మెట్రో స్టేషన్‌లోకి స్నేహితులతో కలిసి వచ్చిన యువతి ప్లాట్‌ఫామ్‌పై ఓ సాంగ్‌కు డ్యాన్స్ చేసింది. అంతేకాకుండా మెట్రో రైలులో కూడా పాట‌ల‌కు చిందులేసింది. ఇందుకు సంబంధించి వీడియోల‌ను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పోస్టులు కాస్త వైర‌ల్‌గా మారాయి. దీనిపై ప‌లువురు నెటీజ‌న్లు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ స‌ద‌రు వీడియోల‌ను మెట్రో అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా స్టేషన్లో డ్యాన్సులు చేయడం మంచి పద్ధతి కాదని, ఆ యువతి ఎవరు, ఏ స్టేషన్‌లో డ్యాన్స్ చేసిందో గుర్తించి చర్యలు తీసుకుంటామని మెట్రో అధికారులు అంటున్నారు.

Next Story