GHMC కార్యాలయం వద్ద ఉద్రిక్తత, కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్

జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు GHMC కార్యాలయాన్ని చుట్టుముట్టారు.

By Srikanth Gundamalla  Published on  28 July 2023 1:56 PM IST
GHMC Office, Congress, Dharna, Arrest ,

GHMC కార్యాలయం వద్ద ఉద్రిక్తత, కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్

జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల కురుస్తోన్న భారీ వర్షాలతో నగరంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని. వారిని ఆదుకోవాలంటూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు GHMC కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు GHMC కార్యాలయాన్ని చుట్టుముట్టారు. కొందరు అయితే లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో.. పోలీసులు తీవ్రంగా స్పందించి కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో.. వారిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న వరద బాధితులకు పదివేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఈ మేరకు కాంగ్రెస్ కార్యకర్తలు జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని ముట్టడించారు. మూడు వైపుల నుండి ఏకకాలంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయాన్ని ముట్టడించారు. లిబర్టీ చౌరస్తా, ఆదర్శనగర్, ట్యాంక్ బండ్ మూడు ప్రాంతాల నుండి ఒకే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు కార్యాలయం వైపునకు దూసుకు వచ్చారు. హైదరాబాద్ లో వరదలతో ప్రజలు అల్లాడుతుంటే కేసీఆర్, కేటీఆర్ నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ శ్రేణులు జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు.

ఉపాధి లేని పేద కుటుంబాలకు, కార్మికులకు పది వేల రూపాయల చొప్పున వెంటనే ఇవ్వాలని.. వరదల్లో మునిగిపోయిన ప్రాంతాలను వెంటనే పునరుద్ధరించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు జీహెచ్‌ఎంసీ కార్యాలయం గేట్లు దూకి లోపలికి వెళ్లి నానా హంగామా సృష్టించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు వెంటనే హస్తం పార్టీ శ్రేణులను అడ్డుకొని అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Next Story