జీహెచ్ఎంసీ మేయర్ కోసం.. కొత్త పరిశీలకుణ్ని నియామకం..!

GHMC Mayor Election Observer. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్నో జిమ్మిక్కులు జరిగాయి. ఎక్కువ మెజార్టీ వస్తుందని

By Medi Samrat  Published on  5 Feb 2021 2:30 PM GMT
జీహెచ్ఎంసీ మేయర్ కోసం.. కొత్త పరిశీలకుణ్ని నియామకం..!

ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్నో జిమ్మిక్కులు జరిగాయి. ఎక్కువ మెజార్టీ వస్తుందని భావించిన టీఆర్ఎస్ వ్యూహం ఉల్టా తీరిగింది. గతంలో కొన్నింటికే పరిమితం అయిన బీజేపీ సీట్లు ఈసారి భారీగా కైవసం చేసుకుంది. అయితే టీఆర్ఎస్, ఎంఐఎం కి పోటీగా బీజేపీ తన సత్తా చాటింది. అయితే ఇప్పటి వరకు మేయర్ పదవిపై తర్జన భర్జన కొనసాగుతూ వస్తుంది. హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ.. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఈ నెల 11న జరగనున్న ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలకుణ్ని నియమించింది. ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా ఈ ఎన్నికకు పరిశీలకునిగా వ్యవహరిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

ఈ నెల 11వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం జీహెచ్ఎంసీ పాలకమండలిని ప్రత్యేకంగా సమావేశపరుస్తూ గతంలోనే నోటిఫికేషన్ జారీ చేసిన ఎస్ఈసీ.. ఏదైనా కారణాల వల్ల ఆ రోజు ఎన్నిక జరగకపోతే మరుసటి రోజు జరుగుతుందని తెలిపింది. ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతిని ఇప్పటికే నియమించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల ఎనిమిదో తేదీన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించనుంది.


Next Story