గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) మేయర్‌గా బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత ఎన్నికైన సంగతి తెలిసిందే..! విజయలక్ష్మికి శుభాకాంక్షలు చెబుతూ పెద్ద ఎత్తున మద్దతుదారులు బ్యానర్లను ఏర్పాటు చేశారు. కానీ ఎక్కడపడితే అక్కడ బ్యానర్లను ఏర్పాటు చేసిన అభిమానికి జీహెచ్ఎంసీ భారీ షాక్ ను ఇచ్చింది.
మేయర్ విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె అనుచరుడు అతిష్ అగర్వాల్ హైదరాబాద్ నగరంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. దాదాపు 15 అడుగుల ఫ్లెక్సీలను ఉంచాడు. ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై నగర పౌరుడు ట్విట్టర్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులను ప్రశ్నించాడు. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు.. ఫ్లెక్సీలు అనధికారికంగా ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన అతిష్ అగర్వాల్‌పై అధికారులు కొరడా ఝళిపించింది. నాలుగు లక్షలా 15వేల రూపాయలు జరిమానా విధిస్తూ జీహెచ్ఎంసీ ఈవీడీఎం అధికారులు షాకిచ్చారు. ఫిబ్రవరి 12న ఈ బ్యానర్లపై ట్వీట్ చేయడం జరిగింది. దీంతో అధికారులు ఫిబ్రవరి 13న ఈ ఛలానాలను విధించారు.