జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఓటర్ స్లిప్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
GHMC Elections : Download Voter Slip Like This. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలకు
By Medi Samrat
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలకు సర్వం సిద్దమైంది. నిన్నటితో ప్రచారానికి పుల్‌స్టాప్ పడగా.. పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టినట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని స్వయం సహాయక బృందాల మహిళల ద్వారా ప్రత్యేక ఓటరు చైతన్య కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. సర్కిళ్ల స్థాయిలో రెసిడెన్ఫియల్ వెల్ఫేర్ అసోసియేషన్లతో సమావేశాలు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ స్లిప్‌లను ఓటర్లే స్వయంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుగా MY GHMC యాప్‌లో ఆప్షన్స్ యాడ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే నగరంలో ఓటర్ స్లిప్‌లను పంపిణీని చేసినప్పటికీ అధిక శాతం మందికి మొబైల్ ఫోన్‌లు ఉండడం వల్ల ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు చెప్పారు. 'డౌన్‌లోడ్ యువర్ ఓటర్ స్లిప్' ఆప్షన్‌పై క్లిక్ చేసి, పేరు, వార్డు నంబరు నమోదు చేయడం ద్వారా వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందనే విషయాన్ని కూడా గూగుల్ మ్యాప్ చూపిస్తుందని చెప్పారు.
KNOW YOUR POLLING STATION ఆప్షన్ క్లిక్ చేసి ఓటరు పేరు, వార్డు పేరు ఎంటర్ చేస్తే ఓటర్ స్లిప్‌తోపాటు పోలింగ్ బూత్ లొకేషన్ కూడా చూపిస్తుందని వివరించారు. పేరుకు బదులు ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్, వార్డు పేర్లు ఎంటర్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.