గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) తన మాన్‌సూన్ టీమ్‌లు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డిఆర్‌ఎఫ్) బృందాలను తీసుకుని వచ్చింది. ఈ సమయంలో ఫిర్యాదులను పరిశీలించడానికి ఈ బృందాలను నియమించింది. GHMC డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ & డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (EV&DM) DRF సహాయం కోసం 040-29555500కి డయల్ చేయాలని ప్రజలను కోరింది. ప్రజలు GHMC యొక్క 040 2111 1111- హెల్ప్‌లైన్‌కు డయల్ చేయడం ద్వారా కూడా ఫిర్యాదులను నివేదించవచ్చు. పలుచోట్ల నీరు నిలిచిపోవడం, రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ రోడ్డుపై పడిన చెట్ల కొమ్మలను తొలగించడం వంటి పనులను ఈ బృందాలు చూసుకుంటాయి.
హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం పడుతోంది. హైదరాబాద్లోని సికింద్రాబాద్, అల్వాల్, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్ పల్లి, చందానగర్, తార్నాక, బాలానగర్, జీడిమెట్ల, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసఫ్ గూడ, అమీర్ పేట్, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, మసబ్ ట్యాంక్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం, శనివారం భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతోంది జీహెచ్‌ఎంసీ. వర్షం తెరిపి ఇవ్వగానే బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు.