టాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ నుండి 190 కిలోల గంజాయి స్వాధీనం
Ganja peddler arrested in Hyderabad. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మరో సారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది.
By Medi Samrat Published on 18 April 2022 12:21 PM GMT
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మరో సారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. అది కూడా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి ఇరుక్కోవడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంలో సోమవారం నాడు ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న టాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ హాథిరామ్‌ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అతడి వద్ద నుంచి ఏకంగా 190 కిలోల గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హాథిరామ్ ను రాచకొండ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు. కర్ణాటక నుండి హైదరాబాద్ కు గంజాయి సరఫరా చేస్తున్నారని పోలీసులు తెలిపారు. హాథిరామ్ తో పాటు ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కురుక్షేత్రం, యుద్ధం శరణం గచ్చామి సినిమాలకు హాథిరామ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. కర్ణాటక నుండి కారులో గంజాయిని హథిరామ్ సరఫరా చేస్తున్నారని పోలీసులు తెలిపారు. హథిరామ్ తో పాటు ఆరుగురిని అరెస్ట్ చేశామని రాచకొండ పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు.హథిరామ్ నుండి 190 కిలోల గంజాయిని సీజ్ చేశామన్నారు.
సహాయ దర్శకుడిగా పనిచేసిన హాథిరామ్ ఆ క్రమంలోనే సినీ తారలకు మత్తు పదార్థాలు, ప్రత్యేకించి గంజాయిని సరఫరా చేయడం మొదలెట్టాడు. అందులో భాగంగా కర్ణాటక నుంచి కారులో గంజాయిని తరలిస్తుండగా అతడితో పాటు ఆరుగురు వ్యక్తులను రాచకొండ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.