హైదరాబాద్: సికింద్రాబాద్ బండిమెట్‌లో విస్తుపోయే ఘటన ఒకటి వెలుగు చూసింది. ఖరీదైన కారులో మోండా మార్కెట్‌లోకి రెక్కీ చేసిన ముఠా రోడ్డు మీద ఉన్న ఆవుకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అపహరించింది. కారులో కుక్కి మరీ ఆవును ఎత్తుకెళ్లారు. స్థానికులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల్లో ఆవులను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వీరిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఖరీదైన కారులో కొందరు యువకులు బండిమేట్‌కు వచ్చారు.. గంట పాటు అక్కడే ఉండి వెళ్ళిపోయారు. వారేవరో అర్ధం కాక సీసీ కెమెరాలు గమనిస్తే అసలు విషయం తెలిసి స్థానికులు షాక్ అయ్యారు.
సికింద్రాబాద్ బండిమేట్ ప్రాంతంలో కొందరు యువకులు రాత్రి సమయంలో కారులో వచ్చారు. కోంత సమయానికి అక్కడ కొన్ని ఆవులు ఆవులు స్ప్రహా లేకుండా పడిపోయి ఉండగా.. మరి కోన్ని ఆవులు కనిపించలేదు. దీంతో వెంటనే సీసీ వీడియోలను స్థానికులు పరిశీలించగా.. కొందరు యువకులు ఆ ఖరీదైన కారులో ఆవులను బలవంతంగా మత్తు మందు ఇచ్చి తీసుకవెళుతున్నట్లు కనిపించింది. ఈ మద్య కాలంలో వరుసగా ఆవులు మాయం అవుతుండడంతో ఎటో వెళ్లిపోయాయని భావించిన స్థానికులు.. ఇప్పుడు సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు చూసి షాక్ అవుతున్నారు. వెంటనే ఆ యువకులపై చర్యలు తీసుకోవలంటూ మోండ మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.