హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం : హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Ganesh Immersion In Hussain Sagar. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం నిషేధించాలని హైకోర్టులో దాఖ‌లైన‌

By Medi Samrat  Published on  5 Aug 2021 7:22 PM IST
హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం : హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం నిషేధించాలని హైకోర్టులో దాఖ‌లైన‌ పిటిషన్‌పై కోర్టు గురువారం విచారణ చేపట్టింది. హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనం నిషేధించాలంటూ న్యాయవాది వేణుమాధవ్‌ వేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లి నేతృత్వంలోని ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. హుస్సేన్‌సాగర్‌ను కాలుష్యరహితంగా అందంగా ఉంచాలని కోరింది. పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దాలని అభిప్రాయపడింది. హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై శాశ్వత నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

2011 లో పిటిషనర్ మామిడి వేణు మాధవ్ వేసిన కేసులోని ఉత్తర్వులు అమలు కానందుకు వేసిన కోర్టు దిక్కర పిటిషన్ చెల్లు బాటు అవుతుందని, దిక్కార పిటిషన్ పై ఇక ముందు విచారణ ఉంటుంది అని బెంచ్ తెలిపింది. కరోనా వైరస్ ఇంకా అంతం కాలేదని పరిస్థితులను అర్థం చేసుకొని ఈ ఏడాది గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వొద్దని నిమజ్జనానికి కూడా అనుమతి ఇవ్వరాదని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వ నిర్ణయాన్ని రేపటి లోగా తెలియ చేస్తామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరిందేర్ సింగ్‌ తెలియజేశారు. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 11కి వాయిదా వేసింది.


Next Story