డిసెంబర్ 11, బుధవారం నాంపల్లి వద్ద ఏక్ మినార్ మసీదు సమీపంలో పెద్ద ప్రమాదం తప్పింది. అక్కడ ఉన్న HP పెట్రోల్ బంక్ వద్ద ఇంధన ట్యాంకర్ కు మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది త్వరగా మంటలను ఆర్పివేయడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు, భారీ ప్రమాదం తప్పింది.
పెట్రోల్ ట్యాంకర్ నుంచి పెట్రోల్ అన్‌లోడ్ చేస్తున్న సమయంలో మంటలంటుకున్నాయి. మంటలను ఆర్పడానికి సిబ్బంది ప్రయత్నం చేశారు. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను అదుపు చేసింది. బంక్ పక్కనే నాంపల్లి రైల్వేస్టేషన్ ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.