విజయవంతంగా 'ఫార్ములా ఈ కార్‌' రేసు

Formula E: Sachin, Dhawan, Ram Charan in Hyderabad. పెట్రోల్‌ వంటి ఇంధనంతో కాకుండా కరెంటుతో నడిచే ఎలక్ట్రిక్‌ వాహనాలతో రూపొందించిన

By Medi Samrat  Published on  11 Feb 2023 7:46 PM IST
విజయవంతంగా ఫార్ములా ఈ కార్‌ రేసు

పెట్రోల్‌ వంటి ఇంధనంతో కాకుండా కరెంటుతో నడిచే ఎలక్ట్రిక్‌ వాహనాలతో రూపొందించిన పోటీనే ‘ఫార్ములా ఈ’ రేసింగ్‌. ఎలక్ట్రిక్‌ కార్లను ప్రోత్సహించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశం. హైదరాబాద్‌ వేదికగా జ‌రిగిన ఈ పోటీలు విజ‌య‌వంతంగా ముగిశాయి. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ రేసులో ఎలక్ట్రిక్‌ కార్లు పోటీపడ్డాయి. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసర్లు దూసుకెళ్లారు. 11 టీమ్‌లు 22 మంది డ్రైవర్లు ఈ రేసులో పాల్గొన్నారు. ఈ రేసులో జీన్‌ ఎరిక్‌ విన్నర్‌గా నిలిచారు. రెండో స్థానంలో నిక్‌ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్‌ బ్యూమీ నిలిచారు.

పోటీల‌లో విజేత‌గా నిలిచిన జీన్‌ ఎరిక్ కు మంత్రి కేటీఆర్ బహుమతి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నగరవాసులు అసౌకర్యానికి మన్నించాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలావుంటే.. ఫార్ములా ఈ రేసు చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. మంత్రి కేటీఆర్‌తో పాటు సినీ ప్రముఖులు య‌ష్‌, రామ్‌ చరణ్‌, నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ హాజరయ్యారు. వీరితో పాటు సచిన్‌, చాహల్‌, ధావన్‌ తదితరులు ఫార్ములా ఈ రేసును వీక్షించారు.

ఇక‌ 2014 బీజింగ్ లో మొట్టమొదటి ‘ఫార్ములా ఈ’ రేసింగ్ జ‌రిగింది. ఆ త‌ర్వాత దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగింది. అనంత‌రం శ‌నివారం హైదరాబాద్‌లో రేసు జరిగింది. ఆ తర్వాత దక్షిణ ఆఫ్రికాలోని కేప్‌ టౌన్‌లో జరుగనుంది.




Next Story