ఫార్ములా - ఈ రేస్: టికెట్ల లభ్యత సమాచారం.. మీ కోసం
Formula - E Race: Ticket Availability Information.. for you. భారతదేశంలో మొట్టమొదటి ఫార్ములా ఇ రేస్ హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో ఉన్న స్ట్రీట్
By అంజి Published on 8 Feb 2023 6:37 AM GMTభారతదేశంలో మొట్టమొదటి ఫార్ములా ఇ రేస్ హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో ఉన్న స్ట్రీట్ సర్క్యూట్‌లో జరగనుంది. ఫిబ్రవరి 6 నుండి నెక్లెస్ రోడ్డు మూసివేయబడింది. పక్కనే ఉన్న రోడ్లు కూడా పోలీసు భద్రతలో ఉన్నాయి. మరోవైపు రేసింగ్‌లో పాల్గొనే ఎలక్ట్రిక్ కార్లు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. 2.8 కిలోమీటర్ల పొడవు గల ట్రాక్‌లో కొన్ని ఫాస్ట్, బ్రేకింగ్ జోన్‌లతో 17 మలుపులు ఉన్నాయి. ఈ రేసు గ్రీన్‌కో హైదరాబాద్ ఇ-ప్రిక్స్‌లో జరగనుంది. వేదిక దాదాపు 20,000 మంది ప్రేక్షకుల గ్రాండ్‌స్టాండ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. టిక్కెట్‌లను మల్టిఫుల్ కెటగిరీలుగా విభజించారు.
హైదరాబాద్ ఇ-ప్రిక్స్ కోసం రూ.1000, రూ. 4000 ధర కలిగిన టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. ఇంకా కొన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి. చౌకైన టిక్కెట్ల ధర రూ. 1,000. ఈ టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. అత్యంత ఖరీదైనది రూ. 10,500. ఇవి ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. అలాగే రూ.1.25 లక్షల ధరతో ఏస్ లాంజ్ ప్యాకేజీ కూడా ఉంది. టిక్కెట్లు BookMyShow.comలో అందుబాటులో ఉన్నాయి
''ఇది టిక్కెట్‌ల కోసం చాలా విస్తారమైన ధరల శ్రేణి. రేసింగ్ చూడాలనుకునే ప్రతి ఒక్కరికీ ఒక ఎంపిక ఉండేలా చూడడమే దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం. మేము చాలా తక్కువ టిక్కెట్‌లకు సబ్సిడీ ఇచ్చాము. మేము ఇంకా టికెట్లను విక్రయిస్తున్నాము. ఆసక్తి ఉన్న ఎవరికైనా అందుబాటు ధరలో ఉండేలా చూడాలనుకుంటున్నాము'' అని ఏస్ Nxt Gen CEO దిల్‌బాగ్ గిల్ చెప్పారు. రేసింగ్ ఈవెంట్ ఫిబ్రవరి 10, 11వ తేదీలలో రెండు రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు మొదటి ప్రాక్టీస్ ఉంటుంది. రెండవ రోజు రెండవ ప్రాక్టీస్, క్వాలిఫైయింగ్, మెయిన్ రేస్ ఉంటుంది.