ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు ఆరు నెలల జైలు శిక్ష పడింది. హైదరాబాద్ జిల్లా మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులోని ఎంపీ, ఎమ్మెల్యే స్పెషల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వరప్రసాద్ ఈ తీర్పును ఇచ్చారు. బంజారాహిల్స్‌లో 2013లో నమోదైన కేసులో నాగేందర్‌ను దోషిగా తేల్చిన కోర్టు రూ.వెయ్యి జరిమానా విధించింది. ఓ వ్యక్తిపై దాడిచేసి గాయపరిచారన్న కేసులో నాగేందర్‌పై అభియోగాలు రుజువు అయ్యాయి. అప్పీల్‌కు వెళ్లేందుకు శిక్ష అమలును నెల రోజులు నిలిపివేసింది.
2015లో జరిగిన ఘర్షణ కేసుకు సంబంధించి విచారణ జరిపిన న్యాయస్థానం.. నాగేందర్‌ను దోషిగా నిర్థారించింది. దీనిలో భాగంగా ఆయనకు 6 నెలల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగిన దానం నాగేందర్.. 2018 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌లో చేరారు. ప్రస్తుతం ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.