హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు డిసెంబర్ 31 రాత్రి అర్ధరాత్రి వరకు పనిచేస్తాయని మెట్రో అధికారులు తెలిపారు.
By Medi Samrat Published on 30 Dec 2024 6:45 PM IST
హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు డిసెంబర్ 31 రాత్రి అర్ధరాత్రి వరకు పనిచేస్తాయని మెట్రో అధికారులు తెలిపారు. చివరి రైలు 12:30 గంటలకు బయలుదేరుతుందని ప్రకటించారు. న్యూఇయర్ సందర్భంగా మెట్రో రైలు వేళలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో రేపు అర్థరాత్రి 12:30 గంటలకు వరకు మెట్రో సర్వీసులు కొనసాగనున్నాయి. మరిన్ని మెట్రో రైళ్లను నడపున్నట్లు హైదరాబాద్ మెట్రో సంస్థ తెలిపింది.