రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో ఏర్పాటు చేసిన సమతామూర్తి.. దర్శనాన్ని నాలుగు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు సమతామూర్తి కేంద్రం ప్రకటించింది. నేటి నుంచి ఏప్రిల్ 1 వరకు భక్తులకు అనుమతి లేదని తెలిపింది. మంగళవారం నుంచి మండల అభిషేకాలు, ఆరాధనలు జరుగుతాయని అందువల్లే సందర్శకుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. తిరిగి ఏప్రిల్ 2 ఉగాది నుంచి యథాతథంగా భక్తులను సందర్శనకు అనుమతించనున్నట్ల చెప్పింది.
భక్తులు ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శించుకోవచ్చని తెలిపింది. ప్రవేశ రుసుంలో ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. ఎప్పటిలాగే ప్రతి బుధవారం కేంద్రానికి సెలవు ఉంటుందని.. సెల్‌ఫోన్, కెమెరాలు మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాలతో సమతామూర్తి కేంద్రంలోనికి అనుమతి లేదని మరోసారి స్పష్టం చేసింది. దర్శనానికి వచ్చే వారందరూ సంప్రదాయ వస్త్రాలతో రావాలని సూచించారు. పాదరక్షలు బయటే వదలాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ఆహార పానీయాలకు లోపలికి అనుమతి లేదని తెలిపింది.