సందీప్ కిషన్‌ వివాహ భోజనంబులో ‘గడువు ముగిసిన’ బియ్యం

టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్‌కు చెందిన 'వివాహ భోజనంబు' రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) టాస్క్ ఫోర్స్ తనిఖీలు జరిపింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 July 2024 3:30 PM IST
సందీప్ కిషన్‌ వివాహ భోజనంబులో ‘గడువు ముగిసిన’ బియ్యం

టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్‌కు చెందిన 'వివాహ భోజనంబు' రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) టాస్క్ ఫోర్స్ తనిఖీలు జరిపింది. ఈ తనిఖీల్లో అనేక ఆహార భద్రత ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.

కీలక ఫలితాలు

గడువు ముగిసిన బియ్యం, సింథటిక్ రంగులు: ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్లు 2022 నాటి "బెస్ట్ బిఫోర్" తేదీతో ఉన్న 25 కిలోల చిట్టిముత్యాలు బియ్యాన్ని గమనించారు. సింథటిక్ ఫుడ్ కలర్స్‌తో కూడిన 500 గ్రాముల కొబ్బరి తురుములను కూడా కనుగొన్నారు.

నిల్వ చేసిన విధానం: ముడి, సెమీ-తయారు చేసిన ఆహారాలు స్టీల్ కంటైనర్‌లలో నిల్వ చేశారు. వాటిని సరిగా కవర్ చేయలేదు. అలాగే సరైన లేబులింగ్ లేవు. రెస్టారెంట్‌లోని కొన్ని డస్ట్‌బిన్‌లకు మూతలు లేవు. ఇది అక్కడి పరిశుభ్రత గురించి ఆందోళన కలిగిస్తుంది.

మెడికల్ సర్టిఫికేషన్ లేకపోవడం: రెస్టారెంట్ తన ఫుడ్ హ్యాండ్లర్‌లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లను తీసుకోవడంలో విఫలమైంది. ఉద్యోగులు, కస్టమర్‌ల ఆరోగ్యం- భద్రతకు భరోసా ఇవ్వడానికి ఇది చాలా కీలకం.

నీటి సమస్యలు: ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు కిచెన్ డ్రెయిన్‌లలో నీరు నిలిచిపోవడాన్ని గమనించారు. ఆహార తయారీలో ఉపయోగించే నీటికి, వినియోగదారులకు అందించే బబుల్ వాటర్‌కు నీటి విశ్లేషణ నివేదిక లేదు.

పరిశుభ్రత, పెస్ట్ కంట్రోల్:

కొన్ని ఉల్లంఘనలు ఉన్నప్పటికీ.. పని చేసే వ్యక్తులు హెయిర్‌నెట్‌లు, యూనిఫాంలు ధరించడం ద్వారా పరిశుభ్రత ప్రమాణాలకు కట్టుబడి ఉన్నారని గుర్తించారు. ప్రాంగణానికి సంబంధించిన పెస్ట్ కంట్రోల్ రికార్డులు కూడా తాజాగా ఉన్నాయి.

భద్రతా చర్యలు:

FSSAI లైసెన్స్ నిజమైన కాపీ ప్రాంగణంలో ఉంచారు. మిగిలిన విషయాలను పాటిస్తూ ఉన్నా.. తక్షణ శ్రద్ధ అవసరమయ్యే అనేక ప్రాంతాల విషయంలో తనిఖీ చేసిన అధికారులు కీలక సూచనలు చేశారు.

తదుపరి చర్యలను నివారించడానికి.. వినియోగదారుల ఆరోగ్యం, భద్రతను నిర్ధారించడానికి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులు వివాహ భోజనంబు యాజమాన్యాన్ని ఆదేశించారు.

సందీప్ కిషన్ కానీ, వివాహ భోజనంబు మేనేజ్‌మెంట్ కానీ ఈ తనిఖీలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

Next Story