గోశామహల్‌లో రాజసింగ్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

Flexies against Rajasingh at Gosamahal. గోశామహల్‌లో రాజసింగ్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి.

By Medi Samrat  Published on  11 Feb 2023 2:37 PM IST
గోశామహల్‌లో రాజసింగ్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

గోశామహల్‌లో రాజసింగ్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. రాజా సింగ్ గ‌తంలో చేసిన వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్‌గా బీఆర్ఎస్‌ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ 1000 కోట్ల సవాల్ కు ప్రతి సవాల్ విసిరారు. ఈ మేర‌కు గోశామహల్ లోని కోఠి, అబిడ్స్, ఎంజే మార్కెట్, సీబీఎస్‌, జుమెరాత్ బజార్ ప్రధాన చౌరస్తాలలో ఫ్లెక్సీ లు ఏర్పాటు చేశారు. రాజసింగ్ గారు.. 1000 పొర్లు దండాలు పెట్టి.. 1000 కోట్లు పంచినా ఓట్లు వేయరు. గోశామ‌హ‌ల్ ప్ర‌జ‌లు నిన్ను చిత్తుచిత్తుగా ఓడిస్తారు. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అంటూ ప్లెక్సీలు ఏర్పాటుచేశారు.

ఇదిలావుంటే.. గోషామహల్ లో మళ్లీ తానే గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోషామహల్ నియోజక వర్గంలో ఓటుకు లక్ష రూపాయలు ఇచ్చినా బీఆర్ఎస్ అభ్యర్థి గెలవరన్నారు. బీఆర్ఎస్ వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా సరే.. చివరికి తనదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. తాను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా గెలిచి చూపిస్తానంటూ రాజాసింగ్ సవాల్ విసిరారు. దీనికి కౌంటర్ గా వెలిసిన‌ ఫ్లెక్సీలు హీట్ పుట్టిస్తున్నాయి.




Next Story