ఐదుగురు దొంగలు అరెస్ట్.. రూ.28.2 లక్షలు స్వాధీనం

Five thieves arrested, Rs 28.2 lakh recovered. అఫ్జల్‌గంజ్‌లో ఓ వ్యక్తిని రూ.50 లక్షలు దోచుకున్న ముఠాను హైదరాబాద్ కమిషనరేట్‌

By Medi Samrat  Published on  11 May 2022 1:13 PM GMT
ఐదుగురు దొంగలు అరెస్ట్.. రూ.28.2 లక్షలు స్వాధీనం

అఫ్జల్‌గంజ్‌లో ఓ వ్యక్తిని రూ.50 లక్షలు దోచుకున్న ముఠాను హైదరాబాద్ కమిషనరేట్‌ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ.28.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విక్కీ రాజ్‌పురోహిత్ (28), మనోజ్ పన్వర్ (33), విష్ణు గోపాల్ (23), తికం చంద్ (25), మితేష్ చౌదరి (25)లుగా గుర్తించారు. మరో నిందితుడు ఖిమ్ రాజ్‌పురోహిత్ (35) పరారీలో ఉన్నాడు.

జోగ్ సింగ్ అనే వ్యాపారి తన కార్మికుడు మిట్టాలాల్‌కు మార్చి 16న మరో వ్యక్తికి అప్పగించాలని కోరుతూ రూ.50 లక్షలు ఇచ్చాడని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. మిట్టాలాల్ క్యాష్ బ్యాగ్‌తో షాహిన్యాత్‌గంజ్‌కు వెళ్తున్నాడు. అఫ్జల్‌గంజ్ వద్ద ద్విచక్రవాహనాన్ని ఆపి, బ్యాగ్‌ని ఎత్తుకెళ్లారు.

"తరువాత వారు రాజస్థాన్‌కు పారిపోయారు. సమాచారం ఆధారంగా.. ఖిమ్ రాజ్‌పురోహిత్ పరారీలో ఉండగా.. వారిలో ఐదుగురిని పట్టుకున్నారు" అని ఆనంద్ చెప్పారు. జోగ్ సింగ్ లావాదేవీలు, నగదు తరలింపు గురించి ఖిమ్ రాజ్‌పురోహిత్‌కు తెలుసు. దీంతో దోపిడీకి ప్లాన్ చేసాడు. దొంగిలించిన డబ్బులో రూ.15 లక్షలు రాజ్‌పురోహిత్‌ వద్ద ఉన్నట్లుగా అతడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story
Share it