హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన రథం ఊరేగింపులో కరెంట్ తీగలు తగిలి ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ఘటన రామాంతాపూర్‌లోని గోకులేనగర్‌లో జరిగింది. కృష్ణాష్టమి పండుగ నేపథ్యంలో ఆదివారం నాడు రాత్రి రథం ఊరేగింపు చేపట్టారు. అయితే కాసేపటికే రథాన్ని లాగుతున్న వెహికల్‌లో టెక్నికల్ సమస్య వచ్చి ఆగిపోయింది. దీంతో ఆ వాహనాన్ని పక్కకు నెట్టిన యువకులు.. రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు.
ఈ క్రమంలోనే రథానికి కరెంట్ తీగలు తగిలాయి. దీంతో తొమ్మిది మందికి కరెంట్ షాక్ కొట్టింది. ఒక్కసారిగా వారంతా దూరంగా విసిరివేయబడ్డారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే తేరుకుని.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఐదుగురు మృతి చెందినట్టు డాక్టర్లు కన్పర్మ్ చేశారు. మృతులను కృష్ణయాదవ్ (21), సురేష్ యాదవ్ (34), రుద్రవికాస్ (39), రాజేంద్రరెడ్డి (45)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.