హైదరాబాద్‌లో ప్రారంభమైన కోవిడ్ మెమోరియల్ పార్క్

First-of-its-kind Covid memorial park opens in Hyderabad. కోవిడ్ మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను తీసింది. మన చుట్టూ ఉన్న వ్యక్తులే

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 July 2022 2:53 PM GMT
హైదరాబాద్‌లో ప్రారంభమైన కోవిడ్ మెమోరియల్ పార్క్

కోవిడ్ మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను తీసింది. మన చుట్టూ ఉన్న వ్యక్తులే మన ముందు కనిపించకుండా పోయారు. "నా బంధువుల్లో ఒకరికి కోవిడ్-పాజిటివ్ వచ్చింది. ఆమె రెండు రోజుల్లో తిరిగి వస్తుందని చెప్పారు. కానీ ఆమె తిరిగి రాలేదు. మేము ఆమెను చివరిసారి కూడా చూడలేకపోయాము." కోవిడ్ -19 బాధితుల గౌరవార్థం హరితం పార్కులో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ నివాసి శ్రీ ఉహా చెప్పారు. దేశంలోనే మొట్టమొదటి ఈ రకమైన పార్క్ 45 పంచవటి కాలనీ, రోడ్ నెం. 10, బంజారాహిల్స్‌లో ఉంది. హరిత స్మారకం జూలై 24న ప్రారంభించబడింది.. తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం కింద అటవీ శాఖ సహకారంతో నిర్మించబడింది.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న చాలా మందికి ఇది భావోద్వేగమైన రోజు. మహమ్మారి సమయంలో వారు కోల్పోయిన వ్యక్తుల కోసం వారు ప్రత్యేక సందేశాలు రాశారు. కొందరు "మిస్ యు బాబాయి" , "నాగమణి అత్తమ్మ, శ్రీను పెదనానా, సురేందర్ పెదన్న జ్ఞాపకార్థం" అని ఉన్నాయి. ఆదివారం జరిగిన కార్యక్రమంలో 100 మందికి పైగా పాల్గొని సుమారు 50-60 మొక్కలు నాటారు. "ఇది మొదటి దశ కార్యక్రమం. 2వ దశలో సుమారు 500-1,000 మొక్కలు నాటాలని.. ఈ కార్యక్రమాన్ని తెలంగాణలోని ఇతర జిల్లాలకు విస్తరించాలని మేము ప్లాన్ చేస్తున్నాము" అని కార్యక్రమ సూత్రధారి చరణ్ చెప్పారు. భారతదేశం అంతటా ఇలాంటి పార్కులను నెలకొల్పాలని కోరుకుంటున్నట్లు చరణ్ తెలిపారు. పార్కు నిర్వహణకు జీహెచ్‌ఎంసీ సహకరిస్తుంది.


"మహమ్మారి సమయంలో కోల్పోయిన ప్రజలను సుమారు 50-60 సంవత్సరాల పాటు ఉండే చెట్టు రూపంలో స్మరించుకోవడానికి ఇది చాలా వినూత్నమైన కార్యక్రమం" అని చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్న నటాషా రామరత్నం చెప్పారు. "చాలా మంది ఉద్వేగానికి లోనయ్యారు. వారిలో ఒకరు, 'నా కజిన్ సోదరి జ్ఞాపకార్థం ఇక్కడ చెట్టు బ్రతికి ఉండడం నాకు సంతోషంగా ఉంది' అని ఆమె చెప్పింది. నెల్లుంట కవిత మాట్లాడుతూ.. ''ఇదొక విశిష్టమైన కాన్సెప్ట్‌ మాత్రమే కాదు.. మన బంధు మిత్రులతో మన జ్ఞాపకాలు, భావోద్వేగాలు, బంధాలు, అనుబంధాలు.. ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేస్తుంది. జీవులు, చెట్లను నాటడం, పర్యావరణాన్ని పరిరక్షించడం చాలా ముఖ్యం" అని అన్నారు.

"ఈ కార్యక్రమంలో మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఎంచుకున్న మొక్కలన్నీ స్థానిక మొక్కలే. అటవీశాఖ అధికారుల ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న మొక్కలన్నింటినీ ఎంపిక చేశాం'' అని చరణ్‌ చెప్పారు. మొక్కలు నాటిన నటాషా మాట్లాడుతూ ఇక్కడ మర్రి, వేప, మహోగని, అశోక, జామున్‌ తదితర చెట్లను నాటినట్లు తెలిపారు. "స్థానికేతర చెట్లు నీటిమట్టాన్ని పెంచవు. అవి పక్షులకు పండ్లను అందించవని కూడా గుర్తించాము. ఈ రోజు మనం నాటిన మర్రి, నేరేడు చెట్లతో పక్షులు, ఉడుతలు ఈ ప్రదేశం చుట్టూ తిరుగుతాయని మేము ఆశిస్తున్నాము." ఆమె చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమ నిర్వాహకుల్లో డాక్టర్ శాంత థౌతం కూడా ఒకరు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్‌, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, తెలంగాణలోని యూకే డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ తదితరులు పాల్గొన్నారు.Next Story
Share it