హైదరాబాద్‌లోని మాదాపూర్ డి-మార్ట్ సమీపంలోని కృష్ణా కిచెన్ రెస్టారెంట్‌లో బుధవారం నాడు భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
అదృష్టవశాత్తూ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. రెస్టారెంట్‌లో లక్షల విలువైన ఫర్నిచర్ అగ్నిప్రమాదంలో బూడిదైంది. గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే, ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.