Hyderabad: మింట్‌ కాంపౌండ్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మింట్‌ కాంపౌండ్‌లోని ప్రభుత్వం ప్రింటింగ్ ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

By అంజి
Published on : 24 Jan 2024 12:06 PM IST

Fire, Mint Compound, Government Book Printing Office, Hyderabad

Hyderabad: మింట్‌ కాంపౌండ్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మింట్‌ కాంపౌండ్‌లోని ప్రభుత్వం ప్రింటింగ్ ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో భారీ మొత్తంలో ప్రింటింగ్ పుస్తకాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. మింట్ కాంపౌండ్ ప్రభుత్వ పుస్తక ముద్రణా కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో ముద్రణా యంత్రాలు, పలు పుస్తకాలు కాలిపోయాయి.

పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతూ ఉండడంతో దట్టమైన పొగలు కార్యాలయం నుండి బయటకి ఎగిసిపడుతూ ఉండడంతో అది గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story