కూక‌ట్‌ప‌ల్లి శివ‌పార్వ‌తి థియేట‌ర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. కుప్ప‌కూలిన పై క‌ప్పు

Fire accident in Shiva Parvathi theater in Kukatpally.హైద‌రాబాద్ న‌గ‌రంలోని కూక‌ట్‌ప‌ల్లిలో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Jan 2022 7:59 AM IST
కూక‌ట్‌ప‌ల్లి శివ‌పార్వ‌తి థియేట‌ర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. కుప్ప‌కూలిన పై క‌ప్పు

హైద‌రాబాద్ న‌గ‌రంలోని కూక‌ట్‌ప‌ల్లిలో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. సోమ‌వారం తెల్ల‌వారుజామున కూక‌ట్‌ప‌ల్లిలోని శివ‌పార్వ‌తి థియేట‌ర్‌లో ఒక్కసారిగా అగ్ని కీల‌లు ఎగిసి ప‌డ్డాయి. పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. గ‌మ‌నించిన స్థానికులు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు. వెంట‌నే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజ‌న్ల‌తో అక్క‌డ‌కు చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు.

అయితే.. అప్ప‌టికే థియేట‌ర్‌లోని సామాగ్రి మొత్తం కాలి బూడిదైంది. ప్ర‌మాదం ధాటికి థియేట‌ర్ పై క‌ప్పు కూలిపోయింది. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో థియేట‌ర్‌లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం, అర్థ‌రాత్రి స‌మ‌యం కావ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. అదే గ‌నుక షో స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగి ఉంటే.. భారీగా ప్రాణ న‌ష్టం సంభ‌వించి ఉండేది. కాగా.. షార్ట్ స‌ర్య్కూట్ కార‌ణంగా మంట‌లు చెల‌రేగిన‌ట్లు బావిస్తున్నారు. సుమారు రూ.2కోట్ల మేర న‌ష్టం వాటిల్లిన‌ట్లుగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ థియేట‌ర్‌లో నాని న‌టించిన 'శ్యామ్ సింగ‌రాయ్' చిత్రం న‌డుస్తోంది.

Next Story