జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి

Fire Accident in Jeedimetla Industrial Area.జీడిమెట్ల పారిశ్రామికవాడలో బుధ‌వారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 July 2021 4:46 AM GMT
జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి

జీడిమెట్ల పారిశ్రామికవాడలో బుధ‌వారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాసెన్స్ ల్యాబ్ అండ్ కెమిక‌ల్ కంపెనీలో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ రోజు తెల్ల‌వారుజామున నాలుగు రియాక్ట‌ర్లు భారీ శ‌బ్దంతో పేలిపోయాయి. దీంతో మంట‌లు ఉవ్వెత్తున ఎగిసిప‌డ్డాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంట‌నే అక్క‌డికి చేరుకున్నారు. ప్ర‌మాదం జ‌రిగిన స్థ‌లంలో ఏడు వ‌ర‌కు రియాక్ట‌ర్లు ఉన్నాయి.

వాటికి మంట‌లు వ్యాపించ‌కుండా నాలుగు పైర్ ఇంజిన్లు, ఆరు ట్యాంక‌ర్ల‌తో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు కార్మికులు మృతి చెందారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒక‌రి పరిస్థ‌తి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప‌రిశ్ర‌మ‌లో ర‌సాయ‌న డ్ర‌మ్ములు నిల్వ ఉన్నాయి. అవి ఇంకా పేలుతున్నాయి. దీంతో ప‌రిశ్ర‌మ ప‌రిస‌ర ప్రాంతంలో పొగ ద‌ట్టంగా అలుముకుంది. కాగా.. అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు.

Next Story