సినిమా షూటింగ్‌లో అగ్నిప్రమాదం

Fire accident in cinema shooting.క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా వాయిదా ప‌డిన సినిమా షూటింగ్‌లు ఇప్పుడిప్పుడే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Aug 2021 10:55 AM IST
సినిమా షూటింగ్‌లో అగ్నిప్రమాదం

క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా వాయిదా ప‌డిన సినిమా షూటింగ్‌లు ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్నాయి. తాజాగా హైద‌రాబాద్‌లోని ఫిలింన‌గ‌ర్‌లో జ‌రుగుతున్న ఓ సినిమా షూటింగ్‌లో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం ఫిలింనగర్‌లో ఓ సినిమా షూటింగ్ జరుగుతున్నది. సినిమా కోసం తీసుకున్న ఓ జనరేటర్‌ వాహనంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. వాహనంలో డీజిల్ లీక్ కావడంతో రోడ్డు పక్కన వున్న కారు, షాపులకు కూడా మంటలు అంటుకున్నాయి. షూటింగ్ వాహనానికి దగ్గరగా, రోడ్డు పక్కన ఆగివున్న హొండా ఐ20 కారు మంటల్లో పూర్తిగా దగ్దమైంది.

ఈ ప్ర‌మాదంతో చిత్ర షూటింగ్ నిలిచిపోయింది. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్నారు. మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. కాగా.. ఈ ప్ర‌మాదంలో ఎవ్వ‌రికి ఏ ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే.. భారీగా ఆస్తి న‌ష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కాగా.. జ‌న‌రేట‌ర్‌లో మంట‌లు ఎలా చెల‌రేగాయి అన్న సంగ‌తి తెలియాల్సి ఉంది.

Next Story