హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఉన్న ఓ పబ్‌లో ఇవాళ మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. జూబ్లీ 800 పబ్‌లోని థర్డ్ ఫ్లోర్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పబ్‌లో మంటలు చెలరేగినప్పుడు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన టైంలో భవనం ఖాళీగా ఉందని పోలీసులు తెలిపారు.
మరోవైపు నిన్న రాత్రి సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. పెను విషాదం నింపిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రూబీ మోటార్స్, రూబీ లాడ్జి యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రంజిత్ సింగ్ బగ్గా, అతని ఇద్దరు కుమారులపై సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. సెల్లార్‌లో ఒకేసారి 40 ఎలక్ట్రిక్ బైక్‌లను పార్క్ చేసి ఛార్జింగ్ చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో బైక్‌లు అన్ని కాలి బూడిద అయ్యాయి. మంటలు చెలరేగడానికి బైక్‌ల చార్జింగే కారమణని భావిస్తున్నారు.