ఫార్ములా - ఈ రేస్‌కు ఎఫ్‌ఐఏ అధ్యక్షుడు!

FIA president expected to attend inaugural Formula E race. ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో జరిగే ఫార్ములా ఇ రేస్‌కు హాజరు కావాల్సిందిగా ఫోర్-వీల్ రేసింగ్

By అంజి  Published on  1 Feb 2023 4:22 PM IST
ఫార్ములా - ఈ రేస్‌కు ఎఫ్‌ఐఏ అధ్యక్షుడు!

న్యూఢిల్లీ: ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో జరిగే ఫార్ములా ఇ రేస్‌కు హాజరు కావాల్సిందిగా ఫోర్-వీల్ రేసింగ్ ఎఫ్‌ఐఏ ప్రపంచ గవర్నింగ్ బాడీ ప్రెసిడెంట్ మహ్మద్ బిన్ సులేయంకు ఆహ్వానం అందింది. డిసెంబర్ 2021లో జీన్ టోడ్ నుండి ఎఫ్‌ఐఏ పగ్గాలను స్వీకరించిన బిన్ సులేయం.. విదేశీ ప్రముఖులతో పాటు భారత్‌కు చెందిన ప్రముఖులతో కలిసి ఆల్-ఎలక్ట్రిక్ సిరీస్ రేసుకు హాజరయ్యే అవకాశం ఉంది. "మహ్మద్‌ బిన్‌ సులేయం రేసుకు హాజరుకావాలని ఆహ్వానించబడ్డాడు. అతను హాజరవుతాడని భావిస్తున్నారు" అని ఫార్ములా ఈ వర్గాలు బుధవారం తెలిపాయి.

రేసు నిర్వాహకులు గ్రీన్‌కో, తెలంగాణ ప్రభుత్వం 2.83 కి.మీ పొడవు గల స్ట్రీట్ సర్క్యూట్‌ను సిద్ధం చేయడానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. చాలా మౌలిక సదుపాయాలు తాత్కాలికంగా ఉంటాయి. అయితే ట్రాక్ చుట్టూ శాశ్వత నిర్మాణంగా ఉండే టీమ్ గ్యారేజీలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఫార్ములా ఈ అనేది 2013లో ఫార్ములా 1 ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ తర్వాత భారతదేశంలో జరుగుతున్న మొదటి ఎఫ్‌ఐఏ ప్రపంచ ఛాంపియన్‌షిప్-స్టేటస్ ఈవెంట్.

భారత్‌లోనే తొలిసారిగా హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ- రేసింగ్ ఈవెంట్​ జరగనుంది. హుసేన్‌సాగర్‌ వేదికగా ఫిబ్రవరి 11న జరుగనున్న ఈ అంతర్జాతీయ ఈవెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. హుస్సేన్ సాగర్ చుట్టూ 2.37 కిలోమీటర్ల మేర ట్రాక్​పై ఈ ఈవెంట్ జరగనుంది. ఎలక్ట్రిక్ రవాణాను ప్రోత్సాహించే ఉద్దేశంతో ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. హైదరాబాద్‌ సర్క్యూట్‌లో అడుగడుగునా భద్రతా పరంగా ప్రత్యేకంగా భారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. పోటీలను వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకుల కోసం గ్యాలరీలను నిర్మిస్తున్నారు.

Next Story