హైదరాబాద్‌లో రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహిళా ఆఫీసర్

హైదరాబాద్‌ శివారులోని నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మణిహారికను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

By Knakam Karthik
Published on : 9 Sept 2025 3:23 PM IST

Hyderabad, ACB, Corruption, Female officer, Bribe

హైదరాబాద్‌లో రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన మహిళా ఆఫీసర్

తెలంగాణలో అవినీతి అధికారులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ వరుస దాడులు చేస్తూ అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నా కొందరి తీరులో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా హైదరాబాద్‌ శివారులోని నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మణిహారికను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ ప్లాట్ ఎల్‌ఆర్ఎస్ క్లియరెన్స్ కోసం వ్యక్తి నుంచి రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసి, రూ.4 లక్షలు తీసుకుంటుండగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికపోయాక ఆమె కన్నీరు పెట్టుకున్నారు. కాగా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి.

Next Story