గ్రేటర్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగిసింది. దీంతో ఎన్నికల అధికారులు శనివారం నామినేషన్లను పరిశీలించనున్నారు. అయితే.. మొత్తం 2,602 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల చివరి రోజైన‌ శుక్రవారం ఒక్కరోజే 1,937 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ- 571, టీఆర్ఎస్‌- 557, కాంగ్రెస్‌- 372, టీడీపీ- 206 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

ఇదిలావుంటే.. డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరుగనుండ‌గా.. 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక‌ అదే రోజు ఫలితాలు వెల్లడించడం జరుగుతుందని ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. 24న మంగ‌ళ‌వారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అని ఈసీ ప్రకటించింది.


సామ్రాట్

Next Story