ఆ ఎనిమిది ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి

మేడ్చల్, లింగంపల్లి, సికింద్రాబాద్ నుండి నడిచే ఎనిమిది MMTS రైళ్లను జూన్ 29, శనివారం నుండి జూలై 6 వరకు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.

By Medi Samrat  Published on  28 Jun 2024 3:26 PM GMT
ఆ ఎనిమిది ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి

మేడ్చల్, లింగంపల్లి, సికింద్రాబాద్ నుండి నడిచే ఎనిమిది MMTS రైళ్లను జూన్ 29, శనివారం నుండి జూలై 6 వరకు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. జూన్ 28, శుక్రవారం విడుదల చేసిన అధికారిక పత్రికా ప్రకటన ప్రకారం.. మెయింటెనెన్స్ కారణాల వల్ల ఈ రైళ్లను రద్దు చేశారు.

రద్దు చేసిన రైళ్ల వివరాలు ఇవే:

రైలు నెం 47222 మేడ్చల్ - లింగంపల్లి

రైలు నెం 47225 లింగంపల్లి - మేడ్చల్

రైలు నెం 47235 మేడ్చల్ - సికింద్రాబాద్

రైలు నెం 47236 సికింద్రాబాద్ - మేడ్చల్

రైలు నెం 47237 మేడ్చల్ - సికింద్రాబాద్

రైలు నెం 47238 సికింద్రాబాద్ - మేడ్చల్

రైలు నెం 47242 మేడ్చల్ - సికింద్రాబాద్

రైలు నెం 47245 సికింద్రాబాద్ - మేడ్చల్

ఇక దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆసిఫాబాద్‌-రేచ్ని రైల్వే స్టేషన్ల మధ్య మూడో రైల్వే లైను నిర్మాణ పనులు జరుగుతుండటంతో మొత్తం 78 రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరో 26 రైళ్లను దారి మళ్లించారు. సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య తిరిగే కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును జూన్ 26 నుంచి జులై 6 వరకు రద్దు చేశారు.

Next Story