జీహెచ్ఎంసీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ నిషేధం..
EC Banned GHMC Exit Polls. ఎన్నికలు ఏవైనా సరే.. పోలింగ్ ముగిసిన వెంటనే అందరూ ఎగ్జిట్ పోల్స్ గురించి ఆసక్తిగా
By Medi Samrat Published on 1 Dec 2020 7:23 AM GMT
ఎన్నికలు ఏవైనా సరే.. పోలింగ్ ముగిసిన వెంటనే అందరూ ఎగ్జిట్ పోల్స్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఏ పార్టీ విజయం సాధిస్తుంది..? ఎవరు గెలుస్తారు..? ఏ పార్టీ ఓటమి పాలవుతుందనేది విషయాలను ఎగ్జిట్ పోల్స్ ద్వారా న్యూస్ ఛానెల్స్, కొన్ని సంస్థలు తమ అంచనాలను, సర్వేలను బయటపెడుతుంటాయి.
నేడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే.. నేడు ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించకూదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఓల్డ్ మలక్ పేట డివిజన్ లోని 69 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిలిచిపోయింది. కంకి కొడవలి గుర్తుకు బదులుగా సుత్తి కొడవలి గుర్తు బ్యాలెట్ పేపర్ పై ముద్రితమైంది. సీపీఐ తరఫున ఈ డివిజన్ నుంచి పోటీ పడుతున్న ఫాతిమా, తన పేరు పక్కన సీపీఎం గుర్తును చూసి అవాక్కై, విషయాన్ని రిటర్నింగ్ అధికారులకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఎన్నికలు జరపాల్సిందేనని ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీల నేతలు గొడవకు దిగినప్పటికీ, ఎన్నికల సంఘం మాత్రం జరిగిన తప్పుపై స్పందిస్తూ.. డివిజన్ మొత్తం పోలింగ్ ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. రేపు పోలింగ్ నిర్వమించనున్నట్టు తెలిపింది. ఇదే సమయంలో మరో ప్రకటన జారీ చేసింది. రేపు ఓల్డ్ మలక్‌పేట్‌లో పోలింగ్ జరగనున్నందున.. ఈరోజు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది ఎస్‌ఈసీ.