డ్రంక్ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలో ప‌ట్టుప‌డ్డ మందుబాబు.. వీరంగం సృష్టించాడు..!

Drunk man attacks cops during drunk driving check at Dundigal. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. దుండిగల్ వద్ద డ్రంక్ అండ్‌ డ్రైవ్‌ తనిఖీ చేస్తున్న ట్రాఫిక్

By Medi Samrat  Published on  19 Aug 2022 2:45 PM IST
డ్రంక్ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలో ప‌ట్టుప‌డ్డ మందుబాబు.. వీరంగం సృష్టించాడు..!

మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. దుండిగల్ వద్ద డ్రంక్ అండ్‌ డ్రైవ్‌ తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులపై దాడి చేశాడు. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో.. మ‌ద్యం సేవించిన ఓ వ్యక్తి ట్రాఫిక్ పోలీసులను నెట్టడం, వారిపై పెద్దపెద్ద‌ రాళ్లు విసరడం కనిపిస్తుంది. మ‌ద్యం సేవించిన వ్య‌క్తి చేతిలో బండ‌రాయి ప‌ట్టుకుని చేసిన హ‌డావుడికి రోడ్డుపై ప్ర‌యాణిస్తున్న వాహ‌న‌దారులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు.


సమాచారం అందుకున్న దుండిగల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్య‌క్తిని అదుపు చేశారు. అతడిని దుండిగల్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. డ్రంక్ అండ్‌ డ్రైవ్‌ చెకింగ్‌లో పట్టుబడటంతో.. ఆ వ్యక్తి కోపంతో ట్రాఫిక్ పోలీసు బృందంపై దాడి చేయడం ప్రారంభించాడని పోలీసు అధికారులు తెలిపారు.


Next Story