హైదరాబాద్: వెయ్యికి, రెండు వేలకు అడుక్కుతింటున్నామంటూ హైడ్రా సిబ్బంది ఆందోళన చేపట్టారు. తగ్గించిన జీతాలు పెంచాలంటూ హైడ్రా పోలీస్ స్టేషన్ ముందు (డీఆర్ఎఫ్) సిబ్బంది ధర్నా చేశారు. ఒకేసారి 5 వేల జీతం తగ్గిస్తే ఎలా బ్రతకాలని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 1272ను సవరణ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా హైడ్రా సిబ్బంది మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ నుంచి హైడ్రాలోకి మమ్మల్ని మార్చి జీతాలను తగ్గించారు. మా జీతాలు మాకు చెల్లించాలి. కొత్త జీవో తీసుకొని వచ్చి మా జీతాలను తగ్గించారు. జీవో నెంబర్ 1272ను సవరించాలి. ఎల్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో కూడా ఆక్సిజన్ లేని సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేశాం. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ వరదలు వచ్చిన ముందుండేది మేమే. హైడ్రా కమిషనర్ స్పష్టమైన హామీ ఇవ్వాలి..అని హైడ్రా సిబ్బంది డిమాండ్ చేశారు.