ఏమో మ‌మ్మ‌ల్ని కూడా అలా చంపుతారేమో.. అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఫ్లోర్ లీడర్, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు

By M.S.R  Published on  16 April 2024 8:28 AM GMT
ఏమో మ‌మ్మ‌ల్ని కూడా అలా చంపుతారేమో.. అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఫ్లోర్ లీడర్, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్బరుద్దీన్ ఒవైసీని కూడా జైల్లో విషం పెట్టి చంపేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఈద్ మిలాప్ సమావేశంలో ప్రసంగిస్తూ.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముఖ్తార్ అన్సారీ మరణాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. కొంతమంది మా ఓవైసీ బ్రదర్స్‌ను జైలుకు పంపాలని చూస్తున్నారని.. జైలులో వైద్యం పేరుతో స్లోపాయిజన్‌ ఇచ్చి చంపాలని ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. తమని హత్య చేస్తారేమో అని అక్బరుద్దీన్ అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో తాము చాలా బలంగా ఉన్నామని అందుకే మమ్మల్ని ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని పార్టీని ఓడించేందుకు అనేక రాజకీయ పార్టీలు ప్రయత్నించినా విఫలమయ్యాయని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈద్ మిలాప్ వేడుకల సందర్భంగా AIMIM ప్రధాన కార్యాలయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో తమ పార్టీని భారతీయ జనతా పార్టీ (BJP).. B-టీమ్‌గా ముద్రించిన వారు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో AIMIM మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీని ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే హైదరాబాద్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Next Story