మాదాపూర్‌.. క్ష‌ణాల్లో నేల‌మ‌ట్ట‌మైన రెండు భారీ భ‌వ‌నాలు(వీడియో)

హైటెక్ సిటీలో ఉన్న రెండు భారీ భవనాలను వాటి యాజమానులు కూల్చివేయించారు.

By Medi Samrat
Published on : 23 Sept 2023 5:09 PM IST

మాదాపూర్‌.. క్ష‌ణాల్లో నేల‌మ‌ట్ట‌మైన రెండు భారీ భ‌వ‌నాలు(వీడియో)

హైటెక్ సిటీలో ఉన్న రెండు భారీ భవనాలను వాటి యాజమానులు కూల్చివేయించారు. మాదాపూర్ లోని మైండ్ స్పేస్ లో ఉన్న 7, 8 అంతస్తులు గల బ్లాక్స్ ను కూల్చివేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ రెండు భారీ భవనాలనుఎడిఫైస్ ఇంజినీరింగ్, జెట్ డెమోలిషన్ సంస్థ‌లు డెమోలిష్(కూల్చి) చేశాయి.

క్షణాల్లోనే ఆ రెండు భవనాలు నేలమట్టం అయ్యాయి. ఒక్కసారిగా రెండు భవనాలను కూల్చివేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.ఈ రెండు భవనాల చుట్టూ ఉన్న ఇతర భవనాలకు ఎటువంటి నష్టం కలగకుండా.. స‌ద‌రు సంద‌స్థ‌లు పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకొని అధునాతన సాంకేతిక ప‌ద్ద‌తుల‌లో కూల్చివేత‌ పనులు చేప‌ట్టాయి. భవనాల కూల్చివేత‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సివుంది.

Next Story