హైదరాబాద్ కు కేజ్రీవాల్

Delhi Chief Minister Arvind Kejriwal is coming to Hyderabad. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైదరాబాద్ కు వస్తున్నారు.

By Medi Samrat
Published on : 26 May 2023 5:16 PM IST

హైదరాబాద్ కు కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైదరాబాద్ కు వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆయన భేటీకానున్నారు. దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో గ్రూప్-ఏ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ను జారీ చేయడాన్ని ఆప్ ప్రభుత్వం తప్పుబడుతోంది.ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వానిదే నియంత్రణాధికారమని సుప్రీంకోర్టు కూడా తీర్పును వెలువరించిందని.. ఈ తీర్పును అమలు చేయాలంటూ కేజ్రీవాల్ తో పాటు ఆప్ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతును కూడగట్టేందుకు ఇప్పటికే పలువురు నేతలను కేజ్రీవాల్ కలిశారు. ఈ క్రమంలోనే కేసీఆర్ తో కేజ్రీవాల్ భేటీ కాబోతున్నారు.

ఢిల్లీ రాష్ట్రంలోని గ్రూప్-ఏ అధికారుల పోస్టింగ్, బదిలీల కోసం ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ నేతలతో పాటూ టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీతో కూడా సమావేశమయ్యారు.

Next Story