బూస్టర్ షాట్‌గా కార్బెవాక్స్.. ఆమోదించిన డీసీజీఐ
DCGI approves Corbevax as first heterologous COVID-19 booster shot for adults. హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ కంపెనీ బయోలాజికల్ ఈ లిమిటెడ్
By Medi Samrat Published on 4 Jun 2022 8:00 PM ISTహైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ కంపెనీ బయోలాజికల్ ఈ లిమిటెడ్ (బిఈ) రూపొందించిన కార్బెవాక్స్ కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను శనివారం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు హెటెరోలాగస్ బూస్టర్ డోస్‌గా ఆమోదించినట్లు ప్రకటించింది. అత్యవసర పరిస్థితుల్లో పరిమితం చేయబడిన ఉపయోగం కోసం కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ల రెండు డోసులు తీసుకున్న ఆరు నెలల తర్వాత దీనిని వేసుకోవాలని సూచించింది. దీంతో కార్బెవాక్స్ భారతదేశంలో కోవిడ్-19 బూస్టర్‌గా ఆమోదించబడిన మొట్టమొదటి వ్యాక్సిన్ గా గుర్తింపు పొందింది.
ఇటీవల బయోలాజికల్ ఈ లిమిటెడ్ కార్బెవాక్స్ పై జరిపిన క్లినికల్ ట్రయల్స్ డేటాను DCGIకి అందించింది. దీంతో ఇప్పటికే రెండు డోస్‌లు తీసుకున్న వ్యక్తులకు కార్బెవాక్స్ వ్యాక్సిన్‌ను హెటెరోలాగస్ బూస్టర్ డోస్‌గా ఇవ్వడానికి అనుమతిని మంజూరు చేసింది. కార్బెవాక్స్ క్లీనికల్ ట్రయల్స్‌లో.. రోగనిరోధక ప్రతిస్పందన, సమర్థవంతమైన బూస్టర్‌కు అవసరమైన భద్రతా ప్రొఫైల్‌లో మెరుగుదలని అందించిందని చూపించింది.
"ఈ ఆమోదంతో మేము సంతోషిస్తున్నాం, ఇది భారతదేశంలో కోవిడ్-19 బూస్టర్ డోస్‌ల అవసరాన్ని పరిష్కరిస్తుందని బీఈ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్లా చెప్పారు. ఇక 18 నుండి 80 సంవత్సరాల వయస్సు గల 416 మందిపై మల్టీసెంటర్ ఫేజ్ III ప్లేసిబో నియంత్రిత హెటెరోలాగస్ బూస్టర్ క్లినికల్ ట్రయల్ నిర్వహించారు. బూస్టర్ వ్యాక్సిన్ బాగా తట్టుకోబడింది. సురక్షితంగా ఉంది. బూస్టర్ డోస్ ఇచ్చిన తర్వాత మూడు నెలలలో తీవ్రమైన, ప్రతికూల సంఘటనలు ఏవీ లేవు. Corbevax టీకా స్లాట్‌ను Co-WIN యాప్ లేదా Co-WIN పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.