హైదరాబాద్ పాతబస్తీలోని బాబానగర్ నుంచి బండ్లగూడా వరకు కొందరు యువకుల పోకిరీ పనులకు అడ్డుకట్ట పడడం లేదు. పోలీసులు ఎంత కఠినంగా చర్యలు తీసుకుంటున్నా కూడా భయం అనే మాట లేకుండా కొందరు యువకులు ప్రాణాంతక బైక్ స్టంట్స్‌కు పాల్పడుతున్నారు.
రద్దీగా ఉండే రహదారులపై పగటిపూటే విన్యాసాలు చేస్తూ, రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదా రులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఒక్క క్షణం తప్పిదం జరిగితే పెద్ద ప్రమాదాలకు దారి తీసే పరిస్థితి ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి స్టంట్స్ వల్ల అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడుతు న్నాయని ప్రజలు చెబుతున్నారు. ఇటువంటి వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. బైక్ స్టంట్స్‌పై ప్రత్యేక నిఘా పెట్టి, కేసులు నమోదు చేయాలని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు.