సైబరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ..

Cyberabad CP Transferred. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బదిలీ అయ్యారు. ఆయనను టీఎస్ఆర్టీసీ

By Medi Samrat  Published on  25 Aug 2021 9:07 AM GMT
సైబరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ..

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బదిలీ అయ్యారు. ఆయనను టీఎస్ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక సజ్జనార్ స్థానంలో స్టీఫెన్ రవీంద్రను కొత్త సీపీగా నియమించారు. కాగా మూడేళ్లకు పైగా సైబరాబాద్ సీపీగా సేవలందించిన సజ్జనార్.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్తో దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. అంతకుముందు వరంగల్ లో యాసిడ్ దాడి నిందితుడి ఎన్‌కౌంటర్లోనూ గుర్తింపు పొందారు.
సజ్జనార్‌ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్వర్వులు జారీ చేశారు. సజ్జనార్ స్థానంలో సైబరాబాద్ కమిషనర్‌గా 1999 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ముత్యాల స్టీఫెన్ రవీంద్రను నియమిస్తున్నట్లు ఆ ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. సజ్జనార్ 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. కీలకమైన కేసులను కూడా పరిష్కరించిన ఐపీఎస్‌గా సజ్జనార్‌కు పేరుంది. ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించి సజ్జనార్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా మహిళల రక్షణకు వినూత్నమైన కార్యక్రమాలు కూడా చేపట్టారు.

Next Story