మహేష్ బాబు కూతురు పేరుతో ట్రేడింగ్ లింక్స్.. పోలీసుల హెచ్చ‌రిక ఇదే..!

సోషల్ మీడియాలో పలువురు ప్రముఖుల పేర్లతో మోసాలు జరుగుతూ ఉంటాయి. ప్రముఖుల పేర్లతో అకౌంట్లు తెరవడం పలు అంశాలలో వారికి భాగస్వామ్యం ఉందంటూ

By Medi Samrat  Published on  10 Feb 2024 3:52 AM GMT
మహేష్ బాబు కూతురు పేరుతో ట్రేడింగ్ లింక్స్.. పోలీసుల హెచ్చ‌రిక ఇదే..!

సోషల్ మీడియాలో పలువురు ప్రముఖుల పేర్లతో మోసాలు జరుగుతూ ఉంటాయి. ప్రముఖుల పేర్లతో అకౌంట్లు తెరవడం పలు అంశాలలో వారికి భాగస్వామ్యం ఉందంటూ ప్రచారం చేసి సాధారణ జనాన్ని మోసం చేస్తూ ఉండడం జరుగుతూ ఉంది. గతంలో పలువురు ప్రముఖులు ఈ అంశంలో ప్రజలను హెచ్చరించారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని పేరును కూడా సోషల్ మీడియాలో కేటుగాళ్ళు వాడేసుకుంటూ ఉన్నారు. ఆమె పేరుతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు తెరిచి.. ట్రేడింగ్ చేయమని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అయితే ఈ విషయం మహేష్ బాబు టీమ్ కు తెలియడంతో ప్రజలను ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని సూచించడమే కాకుండా.. పోలీసులను సంప్రదించారు. సితార పేరుతో ఇతరులకు ఫేక్ ట్రేడింగ్ లింక్స్ ను సైబర్ నేరగాళ్లు పంపిస్తున్నారని తేలింది. ఇంస్టాగ్రామ్ లో ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపి ఎంతో మంది ప్రజల నుండి నగదు కాజేస్తున్నారు కేటుగాళ్లు. మహేష్ బాబు టీం ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

అనుమానాస్పద నోటిఫికెషన్స్ కు స్పందించవద్దని అభిమానులకు టీం మహేష్ సూచన చేసింది. త్వరలోనే సైబర్ నేరగాళ్ళను పట్టుకుంటామని.. ప్రజలు ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. మాదాపూర్ పోలీసులు, టీమ్ GMB ఇన్‌స్టాగ్రామ్‌లో సితార ఘట్టమనేని పేరుతో జరుగుతున్న సైబర్ క్రైమ్ సంఘటన గురించి హెచ్చరిక జారీ చేశారు. గుర్తుతెలియని వినియోగదారులు ఘట్టమనేని సితార పేరుతో మోసపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారని హెచ్చరించారు. గుర్తుతెలియని వారికి ట్రేడింగ్ లింక్ లు, పెట్టుబడికి సంబంధించిన లింక్‌లను పంపుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినా సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నిరోధించడానికి ఈ కార్యకలాపాలకు కారణమైన వ్యక్తిని గుర్తించి, పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్థిక సలహాలను అడిగేముందు సెలబ్రిటీ ఖాతాల ప్రామాణికతను(బ్లూ టిక్) ధృవీకరించుకోవాలని ప్రజలకు సూచించారు.

Next Story