Hyderabad: ఆ హోటల్‌లో ఆకాశనంటుతున్న టిఫిన్ ధరలు.. మండిపడుతున్న కస్టమర్లు
ఇంట్లో టిఫిన్ చేయలేదని హోటల్‌కి టిఫిన్ చేయడానికి వెళ్తున్నారా.. అయితే నీ జేబు గుల్లా అయినట్లే.. ఒక్క నిమిషం ఈ వార్త చదవండి.
By అంజి Published on 14 Sept 2023 12:40 PM ISTHyderabad: ఆ హోటల్‌లో ఆకాశనంటుతున్న టిఫిన్ ధరలు.. మండిపడుతున్న కస్టమర్లు
ఇంట్లో టిఫిన్ చేయలేదని హోటల్‌కి టిఫిన్ చేయడానికి వెళ్తున్నారా.. అయితే నీ జేబు గుల్లా అయినట్లే.. అవునండోయ్ హైదరాబాదు నగరంలో ఉన్న ఓ హోటల్‌కి వెళ్తే అక్కడ ఉన్న రెట్లును చూసి కస్టమర్లు నోరెళ్ళ పెడుతున్నారు. కనీసం దాహంగా ఉందని వాటర్ బాటిల్ కొనడానికి వెళ్తే దానికున్న రేటును చూసి గుట్కలు మింగుతున్నారు. ఇంకా అర్థం కాలే.. ఆ హోటల్‌లో రేట్లు ఆకాశాన్ని మిన్నంటాయి. దీంతో కస్టమర్లు ఆ హోటల్‌పై నిప్పుల వర్షం కురిపిస్తున్నారు. ఈ హోటల్ ఎక్కడో లేదండోయ్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లోనే ఉంది. శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ వద్ద ఉన్న ఉడిపి ఉపహార్ హోటల్లో తిన్నారంటే అంతే సంగతి. మీ జేబు కాస్త ఖాళీ అవుతుంది. బయట వాటర్ బాటిల్ ధర కేవలం 20 రూపాయలు ఉంటే.. ఉడిపి ఉపహార్ హోటల్లో మాత్రం 70 రూపాయలు ఉంది.
అలాగే బయట 30 రూపాయలకు టిఫిన్ ఉంటే ఈ హోటల్లో మాత్రం టిఫిన్ 110 రూపాయలు ఉంది. అంటే నూటికి 200 శాతం ఈ హోటల్ వాళ్ళు వసూలు చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఎక్కువగా టాక్సీ డ్రైవర్లు, ప్రైవేట్ బస్సు డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు వెళ్లే ఈ హోటల్‌లో ఇలా దోచుకోవడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. అంతేకాదండోయ్ ఈ హోటల్లో తిన్నవారికి తాగడానికి మంచి నీళ్లు ఇవ్వరు. 70 రూపాయలు పెట్టి తప్పనిసరిగా వాటర్ బాటిల్ తీసుకోవాలి. ఎవరైనా కస్టమర్లు నీళ్లు అడిగితే వారిపై హోటల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఉడిపి ఉపహార్ హోటల్ నడుపుతున్న యజమాన్యం ఈ విధంగా అధిక రేట్లతో కస్టమర్ల వద్ద నుండి దండిగా డబ్బులు దోచుకుంటున్నారు. సామాన్య జనం వచ్చే ఇటువంటి హోటల్లో టిఫిన్లు వాటర్ బాటిల్ రేట్లు ఆకాశాన్ని మిన్నంటుతుండడంతో కస్టమర్లు హోటల్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.