గండిపేట చెరువు సుందరీకరణ పనులు వెంటనే చేపట్టాలి : సీఎస్‌

CS Shanti Kumari Review of Gandipet Pond Works. గండిపేట చెరువు అభివృద్ధి పనులు, సుందరీకరణ పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

By Medi Samrat  Published on  14 Feb 2023 8:05 PM IST
గండిపేట చెరువు సుందరీకరణ పనులు వెంటనే చేపట్టాలి : సీఎస్‌

గండిపేట చెరువు అభివృద్ధి పనులు, సుందరీకరణ పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్షించారు. ఈ రోజు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తో కలసి గండిపేట చెరువు సుందరీకరణ పనులపై సమీక్షించారు. సుందరీకరణలో భాగంగా మొదటి దశలో Walking Track, Cycling Track సంబంధించి క్షేత్ర స్థాయి పరిశీలన , పనులను వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

గండిపేట చెరువు చుట్టు సుందరీకరణ పనులను చేపట్టుటకు తగిన ప్రణాళికలను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. సుందరీకరణ పనులలో భాగంగా పార్క్ లను కూడా అభివృద్ధి పరచాలని సిఎస్ పేర్కొన్నారు. కోర్టులో ఉన్న కేసులకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్, హెచ్.యం.డి.ఎ, ఎండోమెంట్ , రెవెన్యూ తదితర అధికారులు పాల్గొన్నారు.


Next Story