ఈ రోజు రాత్రి రైడ్ క్యాన్సిల్‌ చేస్తే క‌ఠిన చర్యలు : సీపీ సజ్జనార్

కొత్త సంవత్సరానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. కొన్ని గంటల తర్వాత ప్రపంచం మొత్తం 2026కి స్వాగతం ప‌లుకుతుంది.

By -  Medi Samrat
Published on : 31 Dec 2025 2:04 PM IST

ఈ రోజు రాత్రి రైడ్ క్యాన్సిల్‌ చేస్తే క‌ఠిన చర్యలు : సీపీ సజ్జనార్

కొత్త సంవత్సరానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. కొన్ని గంటల తర్వాత ప్రపంచం మొత్తం 2026కి స్వాగతం ప‌లుకుతుంది. ఇప్ప‌టికే న్యూ ఇయర్ పార్టీలు షురూ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ క్యాబ్‌, ఆటో డ్రైవ‌ర్లు ఓ హెచ్చరిక చేశారు. ఇవాళ అర్ధరాత్రి క్యాబ్, ఆటో డ్రైవ‌ర్లు రైడ్‌లు నిరాకరిస్తే చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. బుక్ చేసిన ఛార్జ్ కంటే అధికంగా డిమాండ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామ‌ని వార్నింగ్ ఇచ్చారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే మోటార్ వాహనాల చట్టం 178(3)(b) సెక్షన్ కింద కేసులు న‌మోదు చేస్తామ‌ని పేర్కొన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుకు వాహన నంబర్, సమయం, ప్రదేశం వివరాలు తప్పనిసరి అని పేర్కొన్నారు. రైడ్ డీటెయిల్స్ స్క్రీన్‌షాట్ పంపించాలని సూచించారు. ఈ మేర‌కు హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నంబర్: 94906 16555 కాంటాక్ట్ అవ్వాల‌ని పేర్కొన్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో భద్రతే లక్ష్యంగా చర్యలు తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు.

Next Story