హైదరాబాద్‌లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయా?

హైదరాబాద్‌లో కోవిడ్ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసుల పెరుగుదలతో పాటు నగరంలో గత కొన్ని రోజులుగా కోవిడ్-19 కేసుల

By అంజి  Published on  19 April 2023 12:00 PM IST
hyderabad , covid cases, Telangana Govt

హైదరాబాద్‌లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయా?

హైదరాబాద్‌లో కోవిడ్ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసుల పెరుగుదలతో పాటు నగరంలో గత కొన్ని రోజులుగా కోవిడ్-19 కేసుల రోజువారీ సంఖ్య పెరుగుతోంది. ఏప్రిల్ 12, 2023న హైదరాబాద్‌లో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య 14. ఇది ఏప్రిల్ 18, 2023 నాటికి 21కి పెరిగింది. మొత్తం తెలంగాణలో మంగళవారం ఎటువంటి కోవిడ్ మరణాలు నివేదించబడనప్పటికీ, క్రియాశీల కేసులు 281 కి పెరిగాయి. రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య 52 కి పెరిగింది.

తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా కోవిడ్ వ్యాక్సిన్‌ను ఏర్పాటు చేసింది

కోవిడ్‌ కేసుల సంఖ్య పెరగకుండా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా, దేశంలో తీవ్రమైన కొరత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల కోవిడ్‌ బూస్టర్‌ డోస్‌త (CorBEvax) మోతాదులను ఏర్పాటు చేసింది. కార్బోవ్యాక్స్‌ అనేది ఒక ముందుజాగ్రత్త మోతాదు. ఇది ఇప్పటికే కొవాగ్జిన్‌ లేదా కొవిషీల్డ్ మొదటి, రెండవ మోతాదు తీసుకున్న వారికి ఇవ్వవచ్చు. రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సార్స్‌ కోవ్‌-2 యొక్క కొత్త వేరియంట్ అయిన ఓమిక్రాన్‌పై ఆందోళనల నేపథ్యంలో ఏదైనా పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరి

ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం యొక్క ప్రాముఖ్యతను కూడా ప్రభుత్వం హైలైట్ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలు తప్పనిసరిగా తప్ప బయటికి వెళ్లకూడదు. వైరస్‌కు వ్యతిరేకంగా రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఇంటి నుండి బయటకు వచ్చే ముందు మాస్క్ ధరించాలని మార్గదర్శకాలలో పేర్కొన్నారు.

Next Story