ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కోర్టు సమన్లు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ తగిలింది. జనవరిలో అయోధ్యకు పంపిన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్టు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే

By Medi Samrat
Published on : 21 Oct 2024 6:11 PM IST

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కోర్టు సమన్లు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ తగిలింది. జనవరిలో అయోధ్యకు పంపిన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్టు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే హిందువుల మనోభావాలు ఈ వ్యాఖ్య‌లు దెబ్బతీశాయని భావిస్తూ, న్యాయవాది ఇమ్మనేని రామారావు హైదరాబాద్ సిటీ కోర్టులో పిటిషన్ దాఖ‌లు చేశారు. విచారణ జ‌రిపిన సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి వై రేణుక నవంబర్ 22వ తేదీన వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎస్ శాంతి కుమారికి కోర్టు సమన్లు జారీ చేశారు. తిరుమల లడ్డూ వివాదం గురించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా, వెబ్‍సైట్లు, యూట్యూబ్ చానెళ్ల నుంచి తొలగించేలా ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు ఇవ్వాలని కూడా కోర్టును పిటిషనర్ కోరారు.

తిరుమల లడ్డూకు వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబుతో సహా, పలువురు కూటమి నాయకులు సంచలన ఆరోపణలు చేశారు. అయితే టీటీడీ వద్ద నాణ్యతకు సంబంధించి మంచి ట్రాక్ రికార్డు ఉందని, కల్తీ జరగలేదంటూ గత ప్రభుత్వంలోని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ వివాదంపై సుప్రీం కోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Next Story