వరిలో కలుపు నివారణకు నోవిక్సిడ్‌ హెర్బిసైడ్‌ను విడుదల చేసిన కొర్టేవా అగ్రిసైన్స్

Corteva Agriscience launched Novacid herbicide for weed control in rice. గ్లోబల్ ప్యూర్-ప్లే అగ్రికల్చర్ కంపెనీగా గుర్తింపు ఉన్న కొర్టేవా అగ్రిసైన్స్, నేడు తెలంగాణలోని హైదరాబాద్‌లో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Dec 2022 12:45 PM GMT
వరిలో కలుపు నివారణకు నోవిక్సిడ్‌ హెర్బిసైడ్‌ను విడుదల చేసిన కొర్టేవా అగ్రిసైన్స్

గ్లోబల్ ప్యూర్-ప్లే అగ్రికల్చర్ కంపెనీగా గుర్తింపు ఉన్న కొర్టేవా అగ్రిసైన్స్, నేడు తెలంగాణలోని హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో తన నోవిక్సిడ్ హెర్బిసైడ్‌ను విడుదల చేసింది. హైదరాబాద్‌లో రోజంతా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ఉత్పాదకత, రైతుకు రాబడి పెంచేందుకు కలుపు నిర్వహణ ప్రాధాన్యతను హైలైట్ చేసింది. నోవిక్సిడ్ భవిష్యత్ సాంకేతికతగా ప్రదర్శించగా, ప్రేక్షకుల నుంచి చక్కని ఆదరణ లభించింది. వరి సాగుదారులు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. లేత వరి మొక్కలకు అవసరమైన పోషకాలు, వనరుల కోసం పోటీపడే సమయంలో కలుపు మొక్కలు దానికి అడ్డుపడుతూ సవాళ్లను విసురుతాయి. నోవిక్సిడ్ వరి కలుపు సంహారక విశిష్టమైన రిన్స్‌కోర్ యాక్టివ్ కలయిక కలుపు నిర్వహణలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఏఎల్‌ఎస్, ఏసీకేస్ (ACCase), హెచ్‌పీపీడీ (HPPD) ఇన్హిబిటర్ హెర్బిసైడ్‌లను తట్టుకునే కలుపు మొక్కలను కూడా సమర్థవంతంగా నియంత్రిస్తుంది. ఇది నేల ఆరోగ్యం, పర్యావరణానికి మేలు చేసే అనుకూలమైన టాక్సికాలజీ, ఎకోటాక్సికాలజీ ప్రొఫైల్‌ను కూడా కలిగి ఉంది. ఇది నోవిక్సిడ్ ని ఒక విలక్షణమైన ఉత్పత్తిగా, వివిధ పరిస్థితులు, నీటి నిర్వహణ పరిసరాలలోనూ సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది.

తెలంగాణలోని నల్గొండకు చెందిన రైతు మానం శ్రీనివాస్ తన పొలంలో నోవిక్సిడ్ ని ఉపయోగించడం వలన కలిగిన ప్రయోజనాలను వివరిస్తూ.. "నా వరి పొలాంలో కలుపు మొక్కలు చాలా పెద్ద సమస్యగా ఉండేది. నా పంటల ఉత్పాదకతను అడ్డుకునే కలుపు మొక్కలు కనీసం ఐదు, ఆరు రకాలు ఉన్నాయి. నోవిక్సిడ్ తో కలుపు మొక్కలు గణనీయంగా తగ్గడాన్ని నేను గమనించాను. ఇది నా దిగుబడిని, నా ఆదాయాన్ని పెంచడంలో సహాయపడింది. నోవిక్సిడ్ తో నేను మరింత సంపాదిస్తానని, నా కుటుంబం కోసం కారు కొనడంతో పాటు నా లక్ష్యాలను చేరుకుంటానని నాకు నమ్మకం ఉంది'' అని ధీమా వ్యక్తం చేశారు.

భారతదేశానికి స్థిరమైన, వినూత్నమైన వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కంపెనీకి ఉన్న నిబద్ధత గురించి కొర్టేవా అగ్రిసైన్స్ దక్షిణ ఆసియా విభాగం అధ్యక్షుడు రవీందర్ బాలయిన్ మాట్లాడుతూ, ''రైతులు తమ సవాళ్లను అధిగమిస్తూ, ఉత్పాదకతను మెరుగుపరుచుకునేందుకు ఆధునిక పరిష్కారాల కోసం చూస్తున్నారు. కొర్టేవా అత్యంత వినూత్నమైన మరియు స్థిరమైన ఉత్పత్తి పరిష్కారాలను మార్కెట్‌కు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. నోవిక్సిడ్ పరిచయంతో, రైతులు పంట ఉత్పాదకతకు ఆటంకం కలిగించే కలుపు మొక్కలను సమర్ధవంతంగా నియంత్రించుకోగలుగుతారు. ఉత్పత్తి సానుకూల టాక్సికాలజీ ప్రొఫైల్ నేల ఆరోగ్యాన్ని నిలుపుకునేందుకు, పంట లాభదాయకతను వృద్ధి చేసేందుకు సమర్థవంతంగా పని చేస్తుంది'' అని వివరించారు.

హైదరాబాద్‌లో రోజంతా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ఉత్పాదకత, రైతుకు రాబడి పెంచేందుకు కలుపు నిర్వహణ ప్రాధాన్యతను హైలైట్ చేసింది. నోవిక్సిడ భవిష్యత్ సాంకేతికతగా ప్రదర్శించగా, ప్రేక్షకుల నుంచి చక్కని ఆదరణ లభించింది. కలుపు నిర్వహణలో సవాళ్ల గురించి మాట్లాడుతూ, వీడ్ సైన్స్ విభాగంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త డా.వి.కె.చౌదరి మాట్లాడుతూ, "హెర్బిసైడ్ రెసిస్టెన్స్ అనేది వరి పండించే భారతీయ రైతులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. ఒకే విధమైన చర్యతో కలుపు సంహారకాలు అభివృద్ధికి నిరోధకాలుగా మారుతూ, ఇది పంటలలో కలుపు మొక్కల ఎదుగుదలకు అవకాశం ఇస్తుంటాయి. అయినప్పటికీ, ప్రత్యామ్నాయ చర్యలతో కలుపు సంహారకాలను ఉపయోగించడం వలన అనేక మంది ఎదుర్కొనే ప్రతికూల సమస్యను అధిగమించవచ్చు. రిన్స్‌కోర్ యాక్టివ్ అనేది నిరోధక అభివృద్ధిని నిరోధించే అణువులలో ఒకటి, ప్రస్తుత పరిస్థితులలో కలుపు నిర్వహణలో సహాయపడుతుంది'' అని వివరించారు.



కొర్టేవా అగ్రిసైన్స్® రైతులకు స్థిరమైన, సంపూర్ణ వ్యవసాయ పద్ధతులను అవలంబించడంలో సహాయపడేందుకు కట్టుబడి ఉంది. రాబోయే తరాలకు పురోగతిని నిర్ధారిస్తూ రైతుల జీవితాలను సుసంపన్నం చేస్తామన్న ధీమా కొర్టేవాకు ఉంది. తన ప్రధానమైన ఆవిష్కరణతో, రైతుల శ్రేయస్సు కోసం కొర్టేవా అధిక-నాణ్యత దిగుబడులు, దీర్ఘకాలిక స్థిరత్వాన్ని అందించే పరిష్కారాలను సృష్టిస్తుంది.




Next Story