హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు
Conspiracy for explosions in Hyderabad.. The police did the checks
By అంజి Published on 2 Oct 2022 4:36 PM ISTహైదరాబాద్‌లో భారీ పేలుళ్ల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఉగ్ర కుట్రకు సంబంధించి నలుగురిని పోలీసులు శనివారం రాత్రి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. అర్థరాత్రి ఆపరేషన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో మూసారాంబాగ్‌కు చెందిన జాహెద్ అనే వ్యక్తి ఉన్నాడు. జాహెద్‌ను రహస్య ప్రాంతంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇతను గతంలో బేగంపేట టాస్క్‌ఫోర్స్ ఆఫీసు పేలుడులో నిర్దోషిగా విడుదలయ్యాడు. జాహెద్ సోదరుడు షాహిద్ బిలాల్‌కు నగరంలో ఉగ్రవాద కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
హైదరాబాద్ పోలీసులు, కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలు, సాయుధ రిజర్వ్ ప్లాటూన్లు సౌత్, నార్త్ మండలాల్లోని వివిధ ప్రాంతాల్లో దాడుల్లో పాల్గొన్నాయని వర్గాలు తెలిపాయి. మూసారాంబాగ్‌తోపాటు సైదాబాద్, చంపాపేట్, బాబానగర్, పిసల్ బండ, సంతోష్ నగర్‌లో అర్ధరాత్రి సిట్, ఈస్ట్ జోన్, సౌత్ జోన్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు.
నలుగురిని విచారణ కోసం తీసుకెళ్లారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన కొంతమంది నాయకులపై దాడికి కుట్ర పన్నినందుకు జాహెద్‌పై కేసు నమోదు చేయబడింది. దానికి సంబంధించి పోలీసులు అతన్ని పట్టుకున్నారు. హైదరాబాద్‌లో పేలుళ్లకు జాహిద్ కుట్ర పన్నినట్లు పోలీసులు తేల్చారు. ఉగ్రవాద కార్యక్రమాల కోసం కొంతమంది యువకులను కూడా జాహెద్ రిక్రూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీని కోసం ఆరుగురు యువకులను నియమించుకున్నాడని సమాచారం.